మార్కెట్లోకి రానున్న మారుతీ ఎస్-క్రాస్ పెట్రోల్ వెర్షన్!

by  |
మార్కెట్లోకి రానున్న మారుతీ ఎస్-క్రాస్ పెట్రోల్ వెర్షన్!
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన మారుతీ సుజుకి కొత్త ఎస్-క్రాస్ పెట్రోల్ వెర్షన్ కారును ఆగష్టు 5న మార్కెట్లో తీసుకురానున్నట్టు కంపెనీ వెల్లడించింది. తొలుత ఈ కారును ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్టు ప్రకటించినప్పటికీ.. కొవిడ్-19 నేపథ్యంలో విడుదలను వాయిదా వేశారు. ఇంతకుముందు ఎస్-క్రాస్ కారు మోడల్ డీజిల్ ఇంజిన్‌తో లభించింది.

అంతకుముందు పాత పెట్రోల్ ఉత్పత్తిని ఆపేశారు. ఇటీవల మారుతీ కంపెనీ డీజిల్ వాహనాల తయారీ పూర్తిగా నిలిపేసినట్టు తెలిపింది. ఎస్-క్రాస్ ఇతర మోడల్ కార్ల లాగే పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇక, మారుతీ సుజుకి ఎస్-క్రాస్ పెట్రోల్ వెర్షన్ మారుతీ మరో మోడల్ బ్రెజా మాదిరిగానే కే5బీ పెట్రోల్ ఇంజిన్‌తో లభించనుంది. 104 హెచ్‌పీ పవర్, 138 ఎన్ఎం టార్క్‌ను ఉతప్త్తిని చేస్తుంది. మైలేజీని పెంచే తేలిక పాటి హైబ్రిడ్ వ్యవస్థ ఈ కారులో అదనంగా అందించనున్నారు.

అలాగే, ఎస్-క్రాస్ పెట్రోల్ వెర్షన్ 5 స్పీడ్ మాన్యువల్, 4 స్పీడ్ ఆటోమెటిక్ వేరియంట్‌లలో లభించనుంది. అయితే, ఇందులో కొత్త ఇంజిన్ మినహా ఎస్-క్రాస్ రూపకల్పనలో ఇతర మార్పులేమీ లేవని కంపెనీ తెలిపింది. ఇదివరకటి లాగే, 16 ఇంచ్ అలాయ్ వీల్స్, క్రూయిజ్ కంట్రోల్ ఉంటుంది. పెట్రోల్ మోడల్ ఆటోమెటిక్ వెర్షన్‌తో తేలికపాటి హైబ్రిడ్ వ్యవస్థ కలిగి ఉంటుంది. ఫేస్ లిఫ్ట్ డెల్టా, ఆల్ఫా, జిటా వేరియంట్‌లలో మార్కెట్లోకి రానుంది. దీని ధర రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.



Next Story