24 శాతం పెరిగిన మారుతీ సుజుకి లాభాలు!

by Harish |
24 శాతం పెరిగిన మారుతీ సుజుకి లాభాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 24 శాతం పెరిగి రూ. 1,941.40 కోట్లుగా వెల్లడించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం 13.3 శాతం వృద్ధితో రూ. 23,458 కోట్లుగా నమోదైంది. అమ్మకాలు పెరగడంతో పాటు వ్యయ తగ్గింపు నేపథ్యంలో కంపెనీ లాభాలు మెరుగ్గా ఉన్నాయని మారుతీ సుజుకి ఇండియా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం 4,95,897 యూనిట్ల వాహనాలను విక్రయించింది.

అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13.4 శాతం అధికం. దేశీయంగా అమ్మకాలు 13 శాతం పెరిగి 4,67,369 యూనిట్లు అమ్ముడవగా, ఎగుమతులు 20.6 శాతం పెరిగి 28,528 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ లాభం 19.3 శాతం వృద్ధితో రూ. 1,484.8 కోట్లుగా ఉంది. అలాగే, ఇతర ఆదాయలు 27 శాతం పెరిగి రూ. 993.7 కోట్ల్గా ఉన్నాయని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. అదేవిధంగా కరోనా మహమ్మారి నుంచి ఈ త్రైమాసికంలో కంపెనీ సామర్థ్య వినియోగం మెరుగుపడిందని, దీనివల్ల కంపెనీ రెండంకెల వృద్ధిని సాధించిందని పేర్కొంది. వస్తువుల ధరలు పెరగడం వల్ల నిర్వహణ పనితీరుపై ప్రభావం ఉందని కంపెనీ అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed