- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాహనదారులకు షాక్.. ఇకపై మారుతీ సుజుకి కార్ల తయారీ బంద్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇకపై డీజిల్ కార్ల విభాగంలోకి వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది. 2023లో తర్వాతి దశ ఉద్గార నియంత్రణ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కాబట్టి ఆ సమయంలో డీజిల్ కార్ల అమ్మకాలు మరింత తగ్గిపోతాయనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని మారుతీ సుజుకి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సివి రామన్ అన్నారు. కర్బన ఉద్గారాల నియంత్రణ నిబద్ధనలను పాటిస్తూనే డీజిల్ కార్ల తయారీని నిర్వహించడం ఖర్చు అధికంగా మారుతుందని, దానివల్ల డీజిల్ కార్ల తయారీ భారమవుతుందని, అమ్మకాలు పడిపోతాయని సీవీ రామన్ వివరించారు.
ప్రస్తుతం దేశంలోని మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో డీజిల్ కార్లు 17 శాతం మాత్రమే ఉన్నాయని, 2013-14 తర్వాత నుంచి భారీగా డీజిల్ కార్ల వాడకం తగ్గింది. అంతకుముందు వరకు మొత్తం కార్ల అమ్మకాల్లో 60 శాతం డీజిల్‌వే ఉండేవని రామన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ కార్లలో ఇంధన మైలేజీ సామర్థ్యం పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అలాగే తక్కువ ఖర్చుతో తయారవుతున్న సీఎన్‌జీ కార్లపై దృష్టి పెడుతున్నామని, భవిష్యత్తులో తమ కంపెనీ బ్రాండ్లు పూర్తిస్థాయిలో టెక్నాలజీతో అందుబాటులో వస్తాయన్నారు.