మారుతీ సుజుకి జూన్ అమ్మకాల్లో 54 శాతం క్షీణత!

by Harish |
మారుతీ సుజుకి జూన్ అమ్మకాల్లో 54 శాతం క్షీణత!
X

దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి జూన్ నెలలో 53.7 శాతం క్షీణతతో 52,300 యూనిట్లను విక్రయించింది. మేలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత జూన్ పూర్తి నెల కార్యకలాపాలు మొదలైనప్పటికీ ఫిబ్రవరిలో విక్రయించిన దానికంటే 40 శాతం తక్కువగా నమోదైనట్టు కంపెనీ వెల్లడించింది. జూన్ నెలకు గాను అన్ని విభాగాల్లోనూ అమ్మకాలు పడిపోయాయని కంపెనీ తెలిపింది. మినీ కార్ల అమ్మకాలు 44.2 శాతం క్షీణించి 10,458 యూనిట్లకు చేరుకోగా, కాంపాక్ట్ కార్లు అయిన స్విఫ్ట్, డిజైర్, సెలారియో, బలెనో, ఇగ్నిస్, వాగన్ ఆర్ అమ్మకాలు 57.6 శాతం తగ్గి 26,696 యూనిట్లకు చేరుకున్నాయి. మిడ్ సైజ్ సెడాన్ సియజ్ 76.2 శాతం పడిపోయి 553 యూనిట్లకు చేరుకున్నాయి. యుటిలిటీ వాహనాల అమ్మకాలు 45.1 శాతం తగ్గి 9,764 యూనిట్లకు చేరుకున్నాయి. ఇక, లైట్ కమర్షియల్ వాహనాల విభాగంలో గతేడాది పోలిస్తే 49.1 శాతం తగ్గి 1,026 యూనిట్లను విక్రయించినట్టు కంపెనీ ప్రకటించింది. ఎగుమతుల పరంగా జూన్‌లో 4,289 యూనిట్లను ఎగుమతి చేసినట్టు కంపెనీ పేర్కొంది. అంచనాలకు విరుద్ధంగా, ఫిబ్రవరిలో జరిగిన 133,702 యూనిట్ల విక్రయాల కంటే చాలా తక్కువగా ఈసారి అమ్మకాలు జరిగాయి. జూన్‌లో, అనేక కంపెనీలు కొవిడ్-19కి ముందున్న అమ్మకాలలో 60-70 శాతం వరకు కోలుకుంటాయని భావిస్తున్నట్లు చెప్పాయి. 3,087 డీలర్‌షిప్‌లలో దాదాపు 90 శాతం ఇప్పుడు దేశవ్యాప్తంగా తెరిచినట్లు మారుతీ సుజుకి కంపెనీ తెలిపింది. “తాము సాధారణ స్థాయికి ఎప్పుడు చేరుకుంటామో ఊహించటానికి కొంత అనిశ్చితి ఉంది” అని కంపెనీ ఛైర్మన్ ఆర్సీ భార్గవ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed