- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన మార్టిన్ గప్తిల్

దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్ ఓపెనింగ్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. తాజాగా గప్తిల్ ఆ పరుగులను అధిగమించాడు. తాజాగా రాంచీలో ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో గప్తిల్ మరోసారి రాణంచి 48 పరుగులు చేశాడు. అయితే ఈ క్రమంలో గప్తిల్ కోహ్లీ చేసిన 3227 పరుగులను అధిగమించాడు. మార్టిన్ గప్తిల్ 111 మ్యాచ్‌లలో 107 ఇన్నింగ్స్ ఆడి 3248 పరుగులతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ 95 మ్యాచ్‌లలో 87 ఇన్నింగ్స్‌లో 3227 పరుగులు చేశాడు. ఇక రోహిత్ శర్మ 118 మ్యాచ్‌లలో 110 ఇన్నింగ్స్ ఆడి 3116 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో ఆరోన్ పించ్ (2608), పీఆర్ స్ట్రిర్లింగ్ (2570), డేవిడ్ వార్నర్ (2554), బాబర్ అజమ్ (2514) ఉన్నారు.