అత్తారింట్లో కోడలు ఆత్మహత్య

దిశ, వెబ్‌డెస్క్: అత్తారింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధి ఎల్లంపేట శివారు సోమ్లా తండాకు చెందిన దేవసోత్ లచ్చును.. కొన్నెళ్ల క్రితం శారద (28) వివాహం చేసుకుంది.

ఆర్థిక పరిస్థితులు, కుటుంబ కలహాల కారణంగా భార్యభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలోనే బుధవారం శారద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. తన కూతురి చావుకి అల్లుడు లచ్చు.. అతడి కుటుంబ సభ్యులే కారణమని శారద తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement