- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బస్తీమేసవాల్’.. రేవంత్‌రెడ్డి బహిరంగ చర్చకు సిద్దమా..? : మర్రి రాజశేఖర్ రెడ్డి
దిశ ప్రతినిధి, మేడ్చల్ : కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష శిబిరం వేదికగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలపై బహిరంగా చర్చకు సిద్దమా..? అని టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సీఎం దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ది శరవేగంగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ దళిత ఆత్మ గౌరవ పేరిట దీక్ష ఎందుకు చేస్తుందో తనకైతే అర్థంకావడంలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ దళితులకు దళిత బంధు ఇస్తున్నందుకా..?, రైతు బంధు..భీమా చెల్లిస్తున్నందుకా..? లేకా ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులను అంబేద్కర్ ఓవర్సిస్ స్కాలర్‌షిప్‌ల ద్వారా ఒక్కోక్కరికి రూ.20 లక్షల చొప్పున ఇచ్చి విదేశాల్లో చదివిస్తున్నందుకా..? అని ప్రశ్నించారు.
సోమవారం మూడుచింతలపల్లి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 24, 25వ తేదీలలో చేపట్టనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షపై మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలు, సీఎం దత్తత గ్రామాల్లో జరుగుతున్న అభివృద్దిపై దీక్ష వేదిక వద్ద బహిరంగ తాము సిద్దమని స్పష్టంచేశారు. ఎంపీగా గెలిచినా రేవంత్ ఈ ప్రాంతాభివృద్దికి చేసిందేమీ లేదన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డికి మూడు గ్రామాలను దత్తత తీసుకుని, అభివృద్ది చేసే అవకాశం ఉందని.. అయితే ఏ గ్రామాలను దత్తత తీసుకున్నారో.. బహిర్గతం చేయాలని మర్రి డిమాండ్ చేశారు.
యద్గార్‌పల్లి ఉద్దెమర్రి వయా పొన్నాల, ఆదర్శపల్లి గ్రామాలకు వెళ్లే రహదారిని మిలటరీ అధికారులు మూసివేస్తుండగా, ఆ మార్గాన ఉన్న చిత్తారమ్మ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ నెల 26వ తేదీన కంటోన్మెంట్‌కు డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ సభ్యులు వస్తున్నందున సిట్టింగ్ ఎంపీగా మిలటరీ అధికారులతో మాట్లాడి ఆ సమస్యను తీర్చాలని సూచించారు.
అభివృద్దికి ఫిదా మా పార్టీలో చేరుతావ్..
సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, కష్టపడే తత్వం ఉన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇక్కడి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది, ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ ఫలాల గురించి రైతులు, దళితులు, వివిధ వర్గాలను అడిగి తెలుసుకోవాలని రాజశేఖర్ రెడ్డి సూచించారు. నిజంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్దిని చూస్తే సీతక్కకు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరాలని అనిపిస్తుందని అన్నారు. మాది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని మర్రి స్పష్టంచేశారు. మీడియా సమావేశంలో మేడ్చల్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేష్, మధుకర్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, మురళి గౌడ్, సర్పంచ్ జాం రవి, సునీత, శ్యామల, శామీర్‌పేట పార్టీ ప్రెసిడెంట్ సుదర్శన్, బలరాం, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.