రైతు వ్యతిరేక ప్రభుత్వాలపై ఉద్యమించాలి: గుజ్జరి

by Sridhar Babu |   ( Updated:2021-12-23 00:54:18.0  )
Raju-1
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: రైతు వ్యతిరేక ప్రభుత్వాలపై రైతాంగం ఉద్యమించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు పిలుపునిచ్చారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వ్యవసాయ మార్కెట్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పలువురు ఆదర్శ రైతులను సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతాంగం చేపట్టిన ఆందోళనకు తలొగ్గిన కేంద్రం రైతు చట్టాలను రద్దు చేసిందన్నారు. రైతులు పండించిన పంటలను రైతులు అమ్ముకునే విధంగా చట్టాలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసే స్వేచ్ఛ ఇవ్వాలన్నారు.

ప్రపంచ వ్యవస్థ నడిచేది వ్యవసాయ రంగంపై ఆ రంగాన్నే నమ్ముకున్న రైతాంగం కష్ట నష్టాల్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రపంచానికి పట్టెడన్నం పెట్టే రైతును ప్రభుత్వాలు ప్రోత్సహించాలని, ఆధునిక వ్యవసాయ రంగం వైపు మళ్లించి అధిక లాభాలు చేకూర్చి రైతుకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మార్కెట్ కార్యదర్శి జీవన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్, డైరెక్టర్లు సుప్రియ, సరిత, రాజన్ బాబు, రాజ్ కుమార్, శ్యామ్ కుమార్ రెడ్డి మాజీ డైరెక్టర్ సత్యం, బాలరాజు, ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed