నా బాత్రూంలో కెమెరాలు పెట్టారు : మరియం షరీఫ్

by Anukaran |   ( Updated:2020-11-13 05:53:16.0  )
నా బాత్రూంలో కెమెరాలు పెట్టారు : మరియం షరీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్ : పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. గతేడాది జైలులో ఉన్న సమయంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను జియో న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు. ‘‘తన సెల్ బాత్రూంలో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. నేను రెండుసార్లు జైలుకు వెళ్లాను. ఒక మహిళగా జైలులో తాను ఎలా ఇబ్బందులు పడ్డాను అనే దానిపై మాట్లాడితే, వారి ముఖాలను చూపించే ధైర్యం కూడా వారికి ఉండదు” అని ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) ప్రభుత్వంపై మరియం నవాజ్ చేసిన విమర్శలో.. ‘‘అధికారులు తన గదిలోకి ప్రవేశించి, తండ్రి నవాజ్ షరీఫ్ ఎదుట అరెస్టు చేశారు. అంతటితో ఆగకుండా వ్యక్తిగత దాడులకు పాల్పడ్డారని చెప్పారు. పాకిస్థాన్‌లో మహిళలకు రక్షణ లేదని వివరించారు. ఓ మహిళ, ఆమె పాకిస్థాన్‌లో ఉన్నా లేకున్నా బలహీనంగా మాత్రం లేదు” అని ఆమె అన్నారు.

ప్రస్తుత పిటిఐ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగిస్తే, రాజ్యాంగ పరిధిలో సైనిక అధికారులతో చర్చలు జరపడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని మరియం నవాజ్ షరీఫ్ తెలిపినట్లు సమాచారం.
కాగా, చౌదరి షుగర్ మిల్స్‌కు చెందిని షేర్లను అక్రమంగా వేరే వ్యక్తులకు బదలాయించి, మనీ లాండరింగ్‌కు పాల్పడిన కేసులో మరియం నవాజ్ షరీష్‌ను పాక్ ప్రభుత్వం అరెస్టు చేయంచింది.

Advertisement

Next Story