- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టోక్యో ఒలింపిక్స్ నుంచి కరోలినా మారిన్ ఔట్
దిశ, స్పోర్ట్స్: స్పెయిన్‌కు చెందిన స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. వరల్డ్ నెంబర్ 4 వ ర్యాంకు కల్గిన కరోలినా మారిన్ ఇప్పటికే ఒలింపిక్స్‌కు స్పెయిన్ తరపున అర్హత సాధించింది. అయితే ఎడమ మోకాలి గాయంతో బాధపడుతున్న ఆమెకు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తేల్చి చెప్పారు. శస్త్ర చికిత్స అనంతరం కొన్ని వారాల పాటు విశ్రాంతి కూడా తీసుకోవల్సి ఉంటుంది. ఒలింపిక్స్‌కు మరో ఆరు వారాలే సమయం ఉన్న నేపథ్యంలో అప్పటిలోగా ఆమె తిరిగి ఫిట్‌నెస్ సాధించడం కష్టం కావడంతో ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది.
‘ఎడమ మోకాలులో చీలిక వచ్చినట్లు డాక్టర్లు గుర్తించారు. దీనికి అత్యవసరంగా సర్జరీ చేసుకోవాల్సి ఉన్నది. త్వరలో సర్జరీ చేయించుకొని అందరి ముందుకు తిరిగి వస్తాను. గత రెండు నెలలుగా ఒలింపిక్స్ కోసం తీవ్రంగా సాధన చేస్తున్నాను. సర్జరీ అనంతరం కోలుకున్నా.. ఒలింపిక్స్ ఆడటం కష్టమే.’ అంటూ భావోద్వేగంగా పోస్టు పెట్టింది. ఈ కష్టకాలంతో తనకు అండగా ఉన్న ప్రతీ ఒక్కరికి మారిన్ కృతజ్ఞతలు తెలిపింది. కాగా, 2016 రియో ఒలింపిక్స్ ఫైనల్‌లో పీవీ సింధూను ఓడించి స్వర్ణ పతకం గెలుచుకుంది