- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రఘురామపై వేటు ఖాయం.. కీలకంగా వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు

X
దిశ, ఏపీ బ్యూరో: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయడం ఖాయమని రాజమహేంద్రవరం ఎంపీ, వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ ధీమా వ్యక్తం చేశారు. రఘురామ కృష్ణంరాజు అనర్హతపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రిమైండర్ నోటీస్ ఇచ్చామని వెల్లడించారు. పౌరుషం ఉంటే ఈటల రాజేందర్ లాగా రఘురామకృష్ణంరాజు కూడా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఆర్టికల్ పది ప్రకారం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న రఘురామ డిస్ క్వాలిఫై ఖాయమని ఎంపీ భరత్ స్పష్టం చేశారు. ఇకపోతే ఇటీవలే వైసీపీ చీఫ్ విప్ హోదాలో స్పీకర్ ఓంబిర్లాతో భరత్ భేటీ అయ్యారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా నూతన ఎంపీల జాబితాను స్పీకర్ ఓం బిర్లాకు అందజేసిన సంగతి తెలిసిందే.
Next Story