- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముగింపు దశకు ధాన్యం సేకరణ: మారెడ్డి
by Shyam |
దిశ, న్యూస్‌బ్యూరో: యాసంగి వరి ధాన్య సేకరణ ముగింపు దశకు చేరుకుందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 86శాతం కొనుగోళ్లు పూర్తికావడంతో 2,505 కొనుగోలు కేంద్రాలను మూసివేడయం జరిగిందన్నారు. బుధవారం పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 6,392 కేంద్రాల ద్వారా 7.35లక్షల మంది రైతుల నుంచి 55లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, ఇందుకు గాను రూ.6,433కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ఇవాళ ఒక్కరోజే రూ. 600 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. కరీంనగర్, కామారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 99శాతం, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో 90శాతానికి పైగా కొనుగోళ్లు పూర్తయ్యాయన్నారు.
Advertisement
Next Story