రైతుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా మావోల లేఖ

by Shyam |
రైతుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా మావోల లేఖ
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : రైతుల ఉద్యమానికి మావోయిస్టులు మద్దతు ప్రకటించారు. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఇందులో రైతుల ఉద్యమానికి ఏవోబీ ఎస్‌జడ్‌సీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కావని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మోడీ 10 సూత్రాల కార్యక్రమం బూటకమన్నారు. ఇందులో ఏ ఒక్కటీ అమలు చేయలదని ప్రకటించారు.

దున్నే వారికే భూమి, విప్లవ ప్రజాకమిటీలకే సర్వాధికారాలు లభించేంతవరకు, నూతన ప్రజాస్వామిక వ్యవస్థ స్థాపించే వరకూ ఇటువంటి సమస్యలకు పరిష్కారం లభించదన్నారు. వ్యవసాయ విప్లవం ఇరుసుగా నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేయటమే రైతాంగ సమస్యకు ఏకైక పరిష్కార మార్గమని సూచించారు. ఎన్ని ఆటుపోట్లు, ఆటంకాలు ఎదురైనా విప్లవ ప్రభుత్వ నిర్మాణం వైపు రైతులు ముందుకు సాగాలని కోరారు.

Advertisement

Next Story