చందుర్తిలో… ఆ ఎర్రజెండాలు ప్రత్యక్షం

దిశ, కరీంనగర్: సిరిసిల్ల జిల్లాలో మళ్లీ జనశక్తి కదలికలు మొదలయ్యాయి. జిల్లాలోని చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం జనశక్తి జెండాలు, వాల్ పోస్టర్లు వెలిశాయి. మండలంలోని సనుగుల, రామారావు పల్లె, బండపల్లి గ్రామాల్లో సీపీఐ ఎంల్, జనశక్తి విప్లవ పార్టీ పేరుతో జెండాలు, వాల్ పోస్టర్లు ప్రత్యక్ష్యం కావడంతో గ్రామస్తులు తీవ్ర భయాదోళనకు గురవుతున్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని, దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement