- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చనిపోయిన వారు మావోయిస్టులు కాదు.. పోలీసులు బీరాలు పలుకుతున్నారు: మావోయిస్టు పార్టీ
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం పెసలపాడులో సోమవారం తెల్లవారు జామున జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. సీపీఐ(మావోయిస్టు) భద్రాద్రి కొత్తగూడెం- తూర్పు గోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి పేరు మీద ఓ ప్రకటన విడుదల చేశారు. ద్రోహి ఇచ్చిన సమాచారంతో దళం ఉండే పరిసరాలకు చేరుకున్న గ్రేహౌండ్స్ పోలీసులు ఆరుగురు అమాయకులను కాల్చి చంపి ఎప్పటి మాదిరిగానే ఎన్కౌంటర్ కట్టుకథ అల్లారని ఆరోపించారు.. ఈ బూటకపు ఎన్కౌంటర్‌ని సీపీఐ మావోయిస్ట్ భద్రాద్రి కొత్తగూడెం- తూర్పుగోదావరి డివిజన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
దీనికి అధికార టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు త్వరలో మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా పార్టీ హెచ్చరించింది. సోమవారం అర్ధరాత్రి అడవిలోకి ప్రవేశించిన పోలీసు పార్టీలకు దళం కంటపడలేదని, దీంతో అసహనానికి గురైన గ్రేహౌండ్స్ పోలీసులు స్థానికులను కొందరిని పట్టుకొని కాల్చిచంపి బీరాలు పలుకుతున్నారని మండిపడింది. అమాయకులను కాల్చి చంపి కట్టు కథలు అల్లే తెలంగాణ పోలీస్‌లు మరోమారు వారి వక్రబుద్ధిని చాటుకున్నారంటూ లేఖలో స్పందించింది. ఈ ఎన్కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసింది.