ములుగులో కరపత్రాల కలకలం.. వారికి హెచ్చరికలు

by Shyam |   ( Updated:20 July 2021 4:07 AM  )
ములుగులో కరపత్రాల కలకలం.. వారికి హెచ్చరికలు
X

దిశ వాజేడు : ములుగు జిల్లాలో కరపత్రాలు కలకలం సృష్టించాయి. ఈనెల 28 నుండి మూడో తారీకు వరకు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు జరగనున్నాయి. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ.. తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ పేరున కరపత్రాలు జిల్లాలోని వెంకటాపురం మండలం బోధ పురం గ్రామంలో వెలిశాయి. నూతన ప్రజాస్వామిక విప్లవం వైపు అడుగులు వేద్దామని అమరుల త్యాగాల బాటలో ప్రయాణిస్తూ ఉద్యమం కొనసాగించాలని, తుది శ్వాస వరకు అమరుల ఆశయం కోసం పోరాడాలని పిలుపునిస్తూ కరపత్రాలలో పేర్కొన్నారు. కొద్దికాలం పాటు స్తబ్దత గా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు కరపత్రాలు వెలసి కలకలం రేపాయి. దీనితో మన్యం ప్రాంతంలోని అధికార పార్టీ నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యం ఎక్కడైనా ఏ క్షణం ఏం జరుగుతుందోననే భయానక వాతావరణం ఏర్పడింది. ఈనెల 28 నుండి ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాలు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని పిలుపునిస్తూ కరపత్రాలు వెలువడిన నేపథ్యంలో పోలీసు వర్గాలు అప్రమత్తమయ్యాయి.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed