- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొక్కే కదా.. అని పారేయకండి!
దిశ, వెబ్ డెస్క్: మనం నిమ్మకాయలను సాధారణంగా వంటకాలకు, ఇతర పానీయాలకు, వ్యాధులకు సంబంధించి ఇలా అనేక రకాలుగా వాడుతుంటాం. ఎందుకంటే.. నిమ్మకాయలతో ఎంతో ఉపయోగముంటది. ఆ నిమ్మకాయల రసం, తొక్కలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా మనం నిమ్మకాయలను ఉపయోగించిన తరువాత అంటే నిమ్మకాయలోని రసాన్ని పిండి, ఆ తొక్కలను పడేస్తుంటాం. కానీ, వాటిని అలా పడేయొద్దు. ఎందుకంటే వాటితో కూడా ఉపయోగాలున్నాయి. నిమ్మకాయలను కట్ చేసి రసం పిండినంక ఆ తొక్కలను పడేయకుండా మీ ఇంటి ముందు గడప, కిటికీల వద్ద అటు, ఇటు చివరి భాగాల్లో పెట్టాలి. దీంతో చీమలు, పురుగులు, కీటకాల సమస్య ఉండదు. మీ ఇంటిలోపల కుళ్లిపోయిన వాసన వస్తే ఆ తొక్కలను నీటిలో వేసి వేడి చేసినంక మీ ఇంటి లోపల పెడితే మంచి సువాన వస్తది. అదేవిధంగా ఓ కప్పులో నీరు పోసి, అందులో ఈ తొక్కలను వేసి.. ఫ్రిడ్జ్ లోపల పెడితే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటది. ఇలా ఇతర సమస్యలకు కూడా నిమ్మకాయ తొక్కలతో ఎన్నో ఉపయోగాలున్నాయి. అందువల్ల వాటిని పడేయకుండా మళ్లీ ఉపయోగించుకుంటే మీకే మేలు.
Tags: Lemon skins, uses, homes