ఖాళీ బిందెలతో అధికారులకు వార్నింగ్ ఇచ్చిన మహిళలు.. ఎక్కడంటే?

by Sridhar Babu |   ( Updated:2021-11-16 10:24:39.0  )
KHAALEE-BINDHELU-1
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో గత నాలుగైదురోజుల నుంచి మంచినీరు రావడంలేదని ఆ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఖాళీ బిందెలతో రోడ్లపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నాలుగైదురోజుల నుంచి మంచినీరు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అధికారులు మంచినీటి సమస్యను ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు. ఇంటిలో చుక్కనీరు లేకుండా ఎలా బ్రతకాలని మున్సిపాలిటీ అధికారులను నిలదీశారు. మంచినీరు కోసం ఇంట్లో ఉన్న పసికందులు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫోన్ చేస్తే పైపులు పగిలిపోయాయి.. రేపు వస్తాయి అంటూ కాలం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు గానీ, ఏ ఒక్క అధికారి గానీ పట్టించుకోవడంలేదని వార్డు ప్రజలు వాపోయారు. రాజకీయ నాయకులకు ఓట్లప్పుడు మాత్రమే గుర్తుకువస్తామని, ఇలాంటి సమయంలో మాత్రం గుర్తుకురామా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు, అధికారులు పట్టించుకుని తమ సమస్యను పరిష్కారించాలన్నారు. లేకపోతే మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story