- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెరుగుతున్న ఉక్కు ధరలను నియంత్రించాలన్న ఐపీఎంఏ
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఉక్కు ధరలను నియంత్రించే అంశంపై జోక్యం చేసుకోవాలని పరిశ్రమ సంఘం భారతీయ పైప్ తయారీదారుల సంఘం(ఐపీఎంఏ) కోరింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు రాసిన లేఖలో.. ఐపీఎంఏ ఉక్కు ఎగుమతులపై తాత్కాలికంగా నిషేధాన్ని విధించాలని, ఈ రకమైన చర్యల ద్వారా ఉక్కు తయారీదారులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు మళ్లించకుండా దేశీయంగా వినియోగానికి వీలవుతుందని పేర్కొంది. ‘దేశీయ మార్కెట్లో పెరిగిన ధరలు, ఉక్కు కొరత కారణంగా పైపు తయారీదారులు, ఎంఎస్ఎంఈలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
దీనికోసం ధరలను నియంత్రించేందుకు, ఉక్కు ఎగుమతులపై కొన్నాళ్ల పాటు నిషేధం విధించేలా జోక్యం చేసుకోవాలని స్టీల్ కార్యాలయాన్ని కోరామని’ అసోసియేషన్ తెలిపింది. ఈ లేఖల కాపీలను ప్రధాని, పరిశ్రమల శాఖ, నీతి ఆయోగ్ కార్యాలయాలకు అందించినట్టు వివరించింది. కాగా, గడిచిన 10 నెలల కాలంలో ఉక్కు ధరలు 60 శాతానికి పైగా పెరిగాయి. రాబోయే రోజుల్లో టన్నుకు రూ. 4,000 వరకు పెరిగే అవకాశాలున్నాయని ఐపీఎంఏ తెలిపింది. ముడి పదార్థాల అవసరాల కోసం స్టీల్ ఉత్పత్తిదారులపై పూర్తిగా ఆధారపడిన చిన్న పరిశ్రమలపై భారం పడుతుందని, వాటి ఉనికికే ప్రమాదమని ఐపీఎంఏ అభిప్రాయపడింది. ఇప్పటికే అనేక పరిశ్రమలు మూతబడ్డాయని, మరిన్ని మూసివేత దశలో ఉన్నాయని వెల్లడించింది.