- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మట్టి గణేశ్‌ను పూజించాలంటున్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు..

X
దిశ, కాటారం : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతీఒక్కరు మట్టి గణేష్ ప్రతిమలు వినియోగించాలని మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మండల కేంద్రమైన గారిపెళ్లి గ్రామంలో గురువారం రాత్రి గద్దె సమ్మిరెడ్డి దంపతులు ఉచిత మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేశ్ ప్రతిమలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతిఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని శ్రీధర్ బాబు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, గద్దె సమ్మిరెడ్డి , శశిభూషణ్ కాచే, ఎంపీపీ సమ్మయ్య, బొమ్మన మల్లారెడ్డి, చీమల సందీప్ పాల్గొన్నారు.
Next Story