అతడు చూస్తే చాలు.. మిలియన్ల వ్యూస్

by Shyam |
అతడు చూస్తే చాలు.. మిలియన్ల వ్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: యూ‌ట్యూబ్, టిక్‌టాక్‌లతో పాటు మరెన్నో సోషల్ మీడియా యాప్స్‌లో కంటెంట్ ఉన్న వీడియోలను చూసేందుకు జనాలు ఇష్టపడుతుంటారు. అందుకే ఆయా సోషల్ మీడియా చానెల్స్‌లో కంటెంట్ క్రియేటర్స్ హవా నడుస్తుంటోంది. వారికి మార్కెట్‌లో డిమాండ్‌ కూడా ఎక్కువే. అయితే వియత్నాంకు చెందిన ఓ వ్యక్తి మాత్రం.. ఏం చేయకుండానే టిక్ టాక్ సెన్షేషన్‌గా మారాడు. అతని వీడియోలు లక్షలాది మంది చూస్తున్నారు.

‘పొద్దటి నుంచి ఏం పనిచేయకుండా.. అలా బద్ధకంగా కూర్చుంటే ఏమొస్తుంది రా. అలా కూర్చుంటే కొండలైన కరిగిపోతాయి. ఒక్క రూపాయైనా సంపాదించే మార్గం వెతుక్కో రా’ అంటూ ప్రతి ఇంట్లో అమ్మనాన్నలు తిడుతుంటారు. వియత్నాంకు చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి అక్షింతలు పడ్డాయో లేదో కానీ.. అతడు మాత్రం నిజంగా ఏం చేయకుండానే మనీ, ఫేమ్ సంపాదిస్తున్నాడు. అతని పేరు ‘అన్హ్ ట్రాన్ టాన్’. అతనిప్పుడు ఇంటర్నెట్ సెన్షేషన్‌గా మారిపోయాడు. టిక్‌టాక్‌లో లక్షలాది మంది అతని వీడియోలను ఫాలో అవుతున్నారు. అతను ఎప్పుడెప్పుడు వీడియో పెడతాడా! అని ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ట్రాన్ ఏం చేస్తాడు? అంటే.. సింపుల్‌గా సెల్‌ఫోన్ కెమెరా ముందు నిల్చుంటాడు. ఎక్స్‌ప్రెషన్ ఉండదు. నవ్వడు, ఏడ్వడు. అసలు ముఖంలో ఏ ఫీలింగ్ చూపెట్డడు. జస్ట్ కెమెరా ముందు అలా ఫ్రీజింగ్‌గా ఉండిపోతాడు. ట్రాన్ సెప్టెంబర్‌లో తన అకౌంట్‌ను ఓపెన్ చేసిన నాటి నుంచి ఇంతే. కానీ అతనికి రోజురోజుకూ ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. అతడి వీడియోలు మిలియన్ వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. దీంతో అతడో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయాడు.

కంటెంట్ రైటర్లు, వ్లాగర్స్ ఓ వీడియో చేయడం కోసం ఎంతగానో కష్టపడుతుంటారు. ఎన్నో ప్లాన్స్ వేస్తుంటారు. ఎంతగానో శోధించి మ్యాటర్ సేకరిస్తుంటారు. కానీ ట్రాన్ వీళ్లందరికీ భిన్నం.. అంతేకాదు ఒక చానల్‌లో ఎన్ని మంచి వీడియోలు ఉన్నా సక్సెస్ కాకపోవచ్చు. కానీ ట్రాన్ ఏం చేయకుండా ఉన్న వీడియోలు మాత్రం నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి.

Advertisement

Next Story