మనోజ్ రీ ఎంట్రీ.. 'అహం బ్రహ్మాస్మి'

by Jakkula Samataha |
మనోజ్ రీ ఎంట్రీ.. అహం బ్రహ్మాస్మి
X

మంచు మనోజ్ … మోహన్ బాబు తనయుడిగా సినిమాల్లోకి అరంగేట్రం చేశాడు. దొంగ దొంగది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మనోజ్… ఆ తర్వాత రాజు భాయ్, బిందాస్, వేదం, కరెంట్ తీగ లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. ఒక్కడు మిగిలాడు మూవీ చేసిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. వ్యక్తిగత కారణాలతో సతమతమైన మనోజ్… మళ్లీ మూడేళ్ల తర్వాత సినిమాల్లోకి వచ్చేస్తున్నాడు. మనోజ్ మంచు ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసిన మనోజ్… అదే హోమ్ ప్రొడక్షన్‌లో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అహం బ్రహ్మాస్మి సినిమాతో వచ్చేస్తున్న మనోజ్ .. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు మనోజ్.

”మూడేళ్ల తర్వాత మీ ముందుకు వస్తున్నాను. నేను దొంగ దొంగది సినిమాతో తెలుగులో మొదటి సినిమా చేసినప్పుడు ఎంత ఎమోషన్‌గా ఫీల్ అయ్యానో… ఇప్పుడు కూడా అదే ఎమోషన్ నాలో ఉంది. నా ప్రయాణంలో సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. నా జీవితమే సినిమా.. మూడేళ్లుగా చాలా మిస్ అయ్యాను… సినీ అమ్మా, వచ్చేశా… లవ్ యూ డార్లింగ్స్” అంటూ ట్వీట్ పెట్టారు.

Advertisement

Next Story