- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మనోజ్ బాజ్‌పాయ్‌కు ఫోన్ చేసి వేధిస్తున్న తాగుబోతులు
దిశ, సినిమా: బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ ప్రస్తుతం ‘డయల్ 100’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. రెన్సిల్ డిసిల్వ దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్యానర్‌పై సిద్ధార్థ్ పి మల్హోత్రా, సప్నా మల్హోత్రా సినిమాను నిర్మించారు. కాగా ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకోగా.. మనోజ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. అయితే మూవీ ప్రమోషన్‌లో భాగంగా వర్చువల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ తనను భయపెట్టిన కొన్ని కాల్స్ గురించి తెలిపాడు. ‘రియల్ లైఫ్‌లో వచ్చే ప్రతీ స్కారీ కాల్స్ అటెండ్ చేసేవాడిని. అర్ధరాత్రి 12:30-1:30 టైమ్‌లో వచ్చే కొన్ని కాల్స్ తీవ్రంగా వేధించాయి. కొంతమంది ఫుల్‌గా తాగి ఫోన్ చేసి ఆడుకునేవారు, బెదిరించేవారు. ఇక అప్పటి నుంచి రాత్రి ఏడున్నర గంటల తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాను’ అని వివరించాడు మనోజ్. కాగా ‘డయల్ 100’ ట్రైలర్‌లో కొడుకును కోల్పోయిన తల్లి(నీనా గుప్తా) పోలీస్ ఆఫీసర్ కుటుంబాన్ని నాశనం చేస్తానని వార్నింగ్ ఇస్తూ కాల్ చేస్తుంది. దీంతో ఫ్యామిలీని కాపాడుకునేందుకు అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? నీనా గుప్తాను ఎలా పట్టుకున్నాడు? అనేదే కథ అని తెలుస్తోంది.