హీరోయిన్‌తో రహస్యంగా బిడ్డను కనడంపై నటుడి క్లారిటీ!

by Shyam |   ( Updated:2021-06-23 02:13:39.0  )
Manish-Raisinghan,Avika-Gor
X

దిశ, సినిమా : టెలివిజన్ నటుడు మనీష్ రాయ్‌సింగన్‌‌ను హీరోయిన్ అవికా గోర్‌తో లింక్‌అప్ చేస్తూ రూమర్స్ ప్రచారం చేస్తుండటంపై స్పందించాడు. గతంలో ‘ససురాల్ సిమర్ కా’ సీరియల్‌లో నటించిన ఈ స్టార్స్‌పై రెండు సంవత్సరాలుగా ఈ తరహా పుకార్లు స్ప్రెడ్ అవుతుండగా.. ఒక స్టేజ్‌లో తామిద్దరం రహస్యంగా బిడ్డను కూడా కన్నామనే వార్తలు కూడా వచ్చినట్టు అవికా గోర్ తన రీసెంట్ ఇంటర్వ్యూలో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక ఈ రూమర్ గురించి మనీష్ రాయ్‌ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తే.. అది అసంభవమని, ఇదే విషయాన్ని తన భార్య సంగీతతో చెప్పి నవ్వుకున్నానని వెల్లడించాడు.

కాగా ‘బాలికావధు’ సీరియల్ ద్వారా ఫేమ్ పొందిన అవికా గోర్ కంటే తను 18 ఏళ్లు పెద్దవాడినని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇద్దరు ఇండివిడ్యువల్స్ బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండాలంటే రిలేషన్‌షిప్‌లోనే ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. అయితే అవికా ఇప్పటికీ తనకు క్లోజ్ ఫ్రెండే అని చెప్పిన మనీష్.. ప్రస్తుతం మిలింద్ చాంద్వానితో రిలేషన్‌షిప్‌లో ఉందని తెలిపాడు. కాగా ఈ టీవీ స్టార్.. జూన్ 2020లోనే సంగీతను పెళ్లిచేసుకున్నాడు.

ఆ ఫోటోగ్రాఫర్ కోసం నగ్నంగా మారిన స్టార్ హీరోయిన్లు.. ఫోటోలు వైరల్

Advertisement

Next Story

Most Viewed