- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు మృతదేహం లభ్యం.. గుండెలు పగిలేలా రోదించిన తల్లి..
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామాంజరం ప్రాంత సరిహద్దున ఉన్న గోదావరి నదిలో పడి ఇద్దరు యువకుల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసందే. ఆకుల సందీప్(20), కేతన్ మణి కుమార్(21)ఇద్దరు ఆదివారం సాయంత్రం రామాంజరం ప్రాంతంలోని గోదావరి నది అందాలను చూసేందుకు వెళ్లి నదిలో జారిపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రోజే ఆకుల సందీప్ మృతదేహం నదిలో లభ్యం అయింది. కానీ కేతన్ మణికుమార్ మృతదేహం దొరకలేదు. దీంతో సోమవారం కేతన్ మణికుమార్ మృతదేహం కోసం స్థానిక పోలీసులు గజ ఈతగాళ్ళుతో గాలింపు చర్యలు చేపట్టగా.. ఎట్టకేలకు మణికుమార్ మృతదేహం లభ్యమైంది. దీంతో మృతదేహాన్ని వడ్డుపైకి తరలించారు. ఒక్కగాను ఒక్కకొడుకు మృతదేహాన్ని చూసి తల్లి గుండెలు పగిలేలా రోదించింది. మణి కుమార్ తల్లి ఆర్తనాదాలు చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.