ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించిన మందకృష్ణ మాదిగ

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: గత ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఖ‌మ్మం ధర్నాచౌక్‌లో కొనసాగుతున్న నిరాహారదీక్షలు శుక్రవారానికి ఐదో రోజు చేరుకున్నాయి.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న పాల్గొని మాట్లాడారు. దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పద‌ని అన్నారు. పైగా దళితులకు కేటాయించిన భూములలో వైకుంఠదామం, డంపింగ్ యార్డు, స్మశాన వాటికలు, కలెక్టరేట్, నూతన బస్టాండు ల్లాంటివి నిర్మించ‌డానికి ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Advertisement