మంచు మ‌నోజ్‌ రీ ఎంట్రీ.. 15 కేజీలు తగ్గి ఇస్మార్ట్‌ లుక్..!

by Shyam |
మంచు మ‌నోజ్‌ రీ ఎంట్రీ.. 15 కేజీలు తగ్గి ఇస్మార్ట్‌ లుక్..!
X

దిశ, వెబ్‌డెస్క్ :తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరో మంచు మనోజ్. ఆయన గత కొంతకాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్నారు. అయినా కరోనా కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు మంచు మనోజ్. సినిమాలకు విరామం ఇచ్చిన తర్వాత మనోజ్ బాగా బరువు పెరిగారు. ఆ బరువును తగ్గడానికి ఆయన లాక్‌డౌన్ సమయాన్ని వినియోగించుకున్నారు.

మంచు మ‌నోజ్ ఏకంగా 15 కిలోలు తగ్గి స్మార్ట్ లుక్‌లోకి మారాడు. ఆయుర్వేదిక్ డైట్, కఠినమైన వ్యాయామం చేసి మనోజ్ స్లిమ్‌గా మారాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. అందరికీ వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మనోజ్ హార్డ్ వర్క్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించి మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకటి తెలుగు దర్శకుడితో తెలుగు / తమిళ చిత్రం, రెండోది తమిళ దర్శకుడి నుండి తెలుగు, తమిళ ద్విభాష చిత్రం. ఈ రెండు చిత్రాల‌ను 2021లో విడుద‌ల‌ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మంచు మ‌నోజ్‌. వీటితో పాటు స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సిటీ కూడా డెవ‌ల‌ప్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే దాని గురించి వివ‌రించ‌నున్నాడు. 2021 మంచు మ‌నోజ్‌కు కొత్త ఆనందాన్ని ఇస్తుందని ఆశిస్తూ.. ఆల్ ది బెస్ట్ రాక్ స్టార్.

Advertisement

Next Story