- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మానకొండూరు పోలీసులపై డీజీపీకి ఫిర్యాదు.. ఎం జరిగిందంటే..!
దిశ, మానకొండూరు ; మానకొండూర్ మండలంలోని వెల్ది గ్రామానికి చెందిన ఎనగంటి శంకరమ్ము మానకొండూర్ పోలీసుల తీరుపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు . వెల్ది గ్రామానికి చెందిన ఎనగంలో పోచయ్యకు ముగ్గురు భార్యలు. ఇద్దరు భార్యలు మరణించగా. మూడవ భార్యగా శుకమ్మను వివాహం చేసుకున్నాడు . పోచయ్య గత రెండు సంవత్సరాల క్రితం మరణించగా , మూడవ భార్య అయిన శంకరమ్మడు భర్త నుంచి సంక్రమించిన భూమిని గత 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవిస్తోంది .
ఈనెల 7వ తేదీన తన భర్త నుంచి సంక్రమించిన భూమిని సాగు చేసే క్రమంలో పోచయ్య మొదటి భార్య కుమారులు ఆదిలాబాద్ , హైదరాబాద్‌లో నివాసం ఉండే ఎనగంటి ప్రవీణ్ , ఎనగం శ్రీనివాస్ , విజయభాస్కర్ , హైదరాబాద్ కు చెందిన నితిన్ ప్రసాద్ , వచ్చారు బౌన్సర్ , మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్‌తో మా భూమిలోకి అక్రమంగా చోరబడి దున్నుతుండగా అడ్డుకోబోయిన మమ్మల్ని వివక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు. నా కుమారుడు ఎనగంటి శ్రీకాంత్ 100 కు డయల్ చేయగా మానకొండూర్ సిఐ చైకృష్ణారెడ్డి ఘటన జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని మాకు వ్యతిరేకంగా, ఎగతాళి చేసి మాతో గొడవ పడి మమ్మల్ని కొట్టిన వారిని విచారించకుండానే మమ్మల్ని పోలీసు స్టేషన్ కు రావాలని అక్కడి నుంచి వెళ్లిపోయారు . పోలీసు స్టేషన్‌నుకు వెళ్లి ఫిర్యాదు ఇవ్వగా ఇలా పిటిషన్ రాసి ఇస్తే తీసుకోను అని , నేను చెప్పినట్లు దరఖాస్తు రాయమని హైదరాబాద్ నుంచి వచ్చిన వారి పేర్లను ధరఖాస్తులో నుంచి తొలగిస్తే దరఖాస్తు తీసుకుంటానని చెప్పారని పేర్కొన్నారు . పోలీసులపై విచారణ జరిపి , మాపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శంకరమ్మ డీజీపీ మహేందర్ రెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో కోరారు .