- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానవత్వం చాటుకున్న మనిషి.. కోతి ప్రాణం కాపాడేందుకు ఏం చేశాడంటే (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో : రోడ్డుపై ప్రమాదాలు జరిగినప్పుడు, అపస్మారక స్మితిలో పడిపోయిన వారికి సాయం చేసేందుకు కొంత మంది ఆలోచిస్తారు. అలాంటిది రోడ్డుపక్కన పడిపోయిన ఒక కోతికి ఓ వ్యక్తి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతోంది. మానవత్వం అంటే ఇదేనంటూ వీడియోను షేర్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని పెరంబలూరుకి చెందిన కారు డ్రైవర్ ప్రభు రోడ్డు పక్కన గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న కోతిని చూశాడు.
వెంటనే వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కానీ, కోతి ఆరోగ్యం విషమంగా మారిపోయి శ్వాస తీసుకోవడం తగ్గిపోవడాన్ని ప్రభు గమనించాడు. దీంతో వెంటనే ఆ కోతికి సీపీఆర్ చేస్తూ.. కోతికి శ్వాసనందించాడు. దీంతో ఒక్కసారిగా కోతి స్పృహలోకి రావడంతో ఆ వ్యక్తి గుండెలకు హత్తుకున్నాడు. ఇలా ఓ కోతి ప్రాణాలు కాపాడేందుకు ఆ వ్యక్తి చేసిన పనికి నెట్టింట హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వీడియోను మీరు చూసేయండి.
A 38-year-old man from #Perambalur tried to resuscitate a wounded monkey by breathing into its mouth. @NewIndianXpress @xpresstn #humanitywithheart pic.twitter.com/iRMTNkl8Pn
— Thiruselvam (@Thiruselvamts) December 12, 2021