యువకుడిపై యువతి యాసిడ్ అటాక్

by Sumithra |   ( Updated:2020-09-04 00:09:22.0  )
యువకుడిపై యువతి యాసిడ్ అటాక్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రియురాలిపై ప్రియుడి యాసిడ్ దాడి. ఈ ట్రెండ్ మారింది. ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామంలో ఈ ఘటన జరిగింది. యువతి ప్రేమించిన యువకుడికి 20 రోజుల క్రితం మరో అమ్మాయితో వివాహం జరిగింది.

ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన యువతి శుక్రవారం అతడిపై యాసిడ్ అటాక్ చేసింది. దీంతో గాయపడిన యువకుడిని చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

కాగా యువతి వారం రోజుల కిందట అతనిపై యాసిడ్ దాడి చేసిన ఘటనలో చేయి కాలింది. దాని నుండి కోలుకునేలోపే మరోసారి యాసిడ్ అటాక్ చేయడంతో అతని కుడి చెంప కాలినట్టు తెలుస్తోంది.

అయితే పెళ్ళైన వారం రోజుల తర్వాత తన దగ్గర తీసుకున్న 8వేలు ఇవ్వాలని యువకుడు కోరడంతోనే.. ప్రేమించి మోసం చేసింది కాకుండా డబ్బులు అడుగుతున్నాడని ఆగ్రహించిన యువతి ఇలా చేసినట్టు స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Next Story