ప్రాణం తీసిన మామిడి చెట్టు

by Sumithra |   ( Updated:2021-06-10 11:38:50.0  )
A man was Died due to accidentally slipped from a mango tree huzurnagar
X

దిశ, హుజూర్ నగర్ : మామిడి చెట్టుపై నుండి ప్రమాదవ శాత్తు‌ జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ మండల పరిధిలోని బూరుగడ్డలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకట్ రెడ్డి కథనం ప్రకారం.. మాధవరాయని గూడెంనకు చెందిన శ్రీపాద గోవింద చారి(40) బూరుగడ్డలో ఓ మామిడి తోటను‌ కౌలుకు‌ తీసుకున్నాడు.

సీజన్‌లో పండ్లను కోసి విక్రయించాడు. గురువారం చెట్టుపై మిగిలిన కాయలను తెంపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కొమ్మ విరిగి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని మెడ భాగంలో బలమైన గాయాలు తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని భార్య శ్రీపాద సమంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా్ప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

Next Story