- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
షాపింగ్ మాల్ స్నేహం… నడిరోడ్డుపై మర్డర్

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణ హత్య కలకలం రేపింది. నగరంలోని గాంధీ పార్క్ వద్ద ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపేశారు దంపతులు.
వివరాల్లోకి వెళ్తే… ప్రకాశం కాలనీకి చెందిన థామస్ అనే వ్యక్తి స్థానిక షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో థామస్‌కు అక్కడే పనిచేస్తున్న పెళ్లైన మహిళతో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ఆ మహిళను వేధించడం మొదలుపెట్టాడు థామస్. దీంతో థామస్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు ఆ దంపతులు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం థామస్‌కు ఫోన్ చేసి గాంధీ పార్కుకు రమ్మని సదరు మహిళ పిలిచింది. అక్కడికి చేరుకున్న థామస్‌ను.. ఆమె భర్త జోసెఫ్ కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడు. అనంతరం భార్యభర్తలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story