మాస్క్ పెట్టుకో అంటే గన్‌తో గురిపెట్టాడు

by vinod kumar |
మాస్క్ పెట్టుకో అంటే గన్‌తో గురిపెట్టాడు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌ ప్రపంచం అంతటా వ్యాప్తి చెందింది. దీని నివారణలో భాగంగా మాస్క్‌లు తప్పని సరి అయ్యాయి. ఏ దుకాణాలకు వెళ్లిన సామాజిక దూరంతో పాటు మాస్క్ ధరించడం తప్పనిసరి అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. మాస్క్ ధరించకుండా వచ్చిన వారిని వెంటనే వెనక్కి పంపుతున్నారు. ఈ కరోనా కాలంలో ఇటువంటి చర్యలు సర్వసాధారణం అయ్యాయి. అత్యధికంగా కరోనా కేసులు నమోదైన అమెరికా వ్యాప్తిలో తొలిస్థానంలో ఉంది. ఇక్కడ కూడా కరోనా నిబంధనలు అమలులో ఉన్నాయి.

అయితే, మాస్క్ ధరించమన్నందుకు ఓ వ్యక్తి అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికా ఫ్లోరిడాలోని ఓ షాపులో రికార్డైన దృశ్యాలు నెటిజన్లను షాక్‌కు గురి చేశాయి. విన్సెంటా స్కావెట్టా అనే వ్యక్తి మాస్క్ లేకుండా షాపుకు వచ్చాడు. ఇదే సమయంలో అతడి పక్కనే ఉన్న వ్యక్తి మాస్క్ ధరించాలని సూచించాడు. దీనికే, విన్సెంటా గన్ తీసి అతడిని గురిపెట్టి చంపేస్తానంటూ బెదిరించాడు. అంతేకాకుండా, ఆ షాపు యజమాని కూతురిపై కూడా గన్ గురిపెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story