నీళ్ల మీద నడవగలిగాడు.. కారణం చెత్త

by Shyam |
నీళ్ల మీద నడవగలిగాడు.. కారణం చెత్త
X

దిశ, వెబ్‌డెస్క్ : నదిలో నీళ్ల మీద నడవడం అసాధ్యం. కానీ బ్రెజిల్ రాజధాని, రియో డీ జెనీరోలోని సారాపుయి నది మీద ఓ వ్యక్తి నడుస్తున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ వ్యక్తి నీళ్ల మీద నడవగలగడానికి కారణం చెత్త. సూటిగా చెప్పాలంటే చెత్తను మేనేజ్ చేయలేని మానవుని అసమర్థత. నదిలో నీళ్ల మీద దట్టంగా పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్త మీద అంతా సునాయాసంగా నడుస్తూ వెళ్లడాన్ని బట్టి చూస్తే, ఆ చెత్త సాంద్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే చెత్త ఆ నదిలో కొద్దికొద్దీగా పేరుకుపోతూ పక్కనే ఉన్న జాతీయ పార్కు వరకు చేరుకుంటోంది. ప్రతి ఏడాది ఈ నదికి వరదలు వస్తాయి. ఆ వరద నీటితో పాటుగా ప్లాస్టిక్ కూడా కొట్టుకొస్తుంది. అలా కొట్టుకొచ్చిన ప్లాస్టిక్ వరదలు తగ్గి, నీళ్లు వెనక్కి వెళ్లిపోయాక ఇక్కడే పేరుకుపోతుంది. అలాగే ఈ నదికి చుట్టుపక్కల నివసించే వాళ్లు కూడా చెత్తను ఇళ్లలో కాకుండా నదిలో పడేస్తారు. ఇలా పడేయడం వల్ల నీరు కలుషితమై ఆ చుట్టుపక్కల వారికి మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతోంది.

Advertisement

Next Story