- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గిన్నీస్ రికార్డు సృష్టించిన మైక్ హోవార్డ్

దిశ, ఫీచర్స్ : సాహసాలు చేయడం, రికార్డ్స్ తిరగరాయడమంటే కొందరికీ భలే ఇంట్రెస్ట్. అందుకోసం ఎంత పెద్ద రిస్క్ చేయడానికైనా వెనకాడరు. అలా ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెట్టే సాహసం చేశాడు బ్రిటన్‌కు చెందిన మైక్ హోవార్డ్. దీనికి సంబంధించిన వీడియోను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్టు చేసింది. దాంతో నెట్టింట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.
గిన్నిస్ బుక్ ప్రకారం.. యూకేకు చెందిన మైక్ హోవార్డ్ రెండు హాట్ ఎయిర్ బెలూన్ల మధ్య అత్యధిక ఎత్తులో నడవడం ద్వారా రికార్డు సృష్టించాడు. అయితే ఇదంతా గతం కాగా 2004 నాటి పాత వీడియోను వాకింగ్ ‘బిట్వీన్ టూ హాట్ ఎయిర్ బెలూన్స్ – గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’ అనే క్యాప్షన్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తాజాగా షేర్ చేసింది. ఈ వీడియో ప్రకారం మైక్ హోవార్డ్ 21,400 అడుగుల (6,522 మీ) వద్ద రెండు హాట్ ఎయిర్ బెలూన్‌లను కలిపే మెటల్ ప్లాంక్‌పై నడుస్తున్నట్లు కనిపిస్తోంది. యూకే నివాసి అయిన మైక్.. యూకేలోని సోమర్‌సెట్, యెయోవిల్ సమీపంలో ఈ ఫీట్ చేశాడు. హోవార్డ్ ధైర్యాన్ని చూసి నెటిజన్లు చాలామంది ఆశ్చర్యపోగా, మరెంతోమంది క్లిప్‌ను చూసి భయపడ్డారు. ఇది చాలా ప్రమాదకర విన్యాసమని, ఇలాంటివి చేయడం ప్రాణాలకే ప్రమాదమంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.