- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏది ప్రకృతి ధర్మం ..? ఏది మనిషి ధర్మం
ఉదయించే సూర్యుడు
మనమెవరమని వెలుతురును ఇస్తుంది
ఏ తరుపు చుట్టమని
తరువు ఆక్సిజన్ అందిస్తుంది
చీకటి ఒడిలో
ఆదమరిచి నిద్రిస్తున్నామే
అందుకు అద్దె చెల్లిస్తున్నామా దానికి ..?
నీటి కెందుకో అంత తపన
ధరణి దాహార్తిని తీర్చాలని ..,
అది ప్రకృతి ధర్మం …!
మరి మనిషి ధర్మం ఏమైనట్టు ..?
ప్రకృతి బిడ్డవైన నీకు ఇన్ని లభిస్తున్నా..,
నాకేం ఇచ్చ్చావని ఆకాశాన్ని అడిగితే
నిన్ను ఈ మూమ్మీదకి దించాను కదా
అనే గొప్ప సమాధానం చెప్పలేక
ఒంటరిగా కుమిలిపోతుంది
పుడమి తన కడుపును చీల్చి
విత్తనానికి జన్మనిస్తుంది
నింగి చిటికెన వేలును అందించి
దాన్ని మహావృక్షం చేస్తుంది
ఆకాశం వర్షించేలా ..
భూదేవి హర్షించేలా ..,
తన అవయవాలను రక్త మొందించి
పుట్టిన ఋణం తీర్చుకుంటుంది చెట్టు
రాగద్వేషాలున్నది చెట్టు
చవట బతుకు చెట్టు వల్ల కాదు
చెట్టుకు మనిషికి పోలికా ..?
చీకటి వెలుతురుల సేవలు తెలియని తనం
నింగీ నేలా కష్టం గుర్తించని గుణం
మనీయే ధ్యేయమైన దేహం తాలూకు
అహం కొమ్మలను
అప్పుడప్పుడు అదిలించకపోతే
వదిలించుకుంటుంది సమాజం ..
అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరిస్తేనే కదా
చెట్టు నేలను చూస్తూ నింగినందుకోగలదు
విజ్ఞానం విచ్చిన్నం ఐన చోట
అజ్ఞానం వైఫైలా మనిషిని చుట్టేసిన వేళ
అక్కరకురాని ఆదాయం పోగైన చోట
ఏ బంధమైతేనేమి
చివరకు పేగుబంధమైనా
రాగబంధంలేని రాయిలా మారుతుంది
పాయసం లో ముంచి తీసిన బుల్లెట్ ఐన
మనసులోకి దూరితే బాధగానే ఉంటది
ఆకాశం దుఃఖిస్తే
అవని అందుకు పుత్రుణ్ణి శపిస్తే
ఆ తనయుడికి గుండె ఘర్షణ తప్పదు
సమూహంగా సంతోషించడానికి
సంకోచిస్తున్నావంటే
ఒంటరిగా కూర్చొని ఏడవడానికి
దరఖాస్తు పెట్టుకున్నట్లే ..
లోభి మొసలికన్నీరు ఖర్చుచేసినంతగా ..,
కన్నీటిని ఖర్చు చేయడు
అందరిని వదిలేసిన మనిషి
అన్నిటిని వదిలేసిన మనిషి
చివరికి మనిషి ధర్మాన్నే వదిలేసి
ధనశయ్యను కావలించుకున్నప్పుడు
అది అంపశయ్య అవక మానదు .
–నామాల రవీంద్రసూరి,
9848321079