దారుణం.. ఇద్దరు పిల్లలను భవనంపై నుంచి విసిరేశాడు

by Sumithra |
దారుణం.. ఇద్దరు పిల్లలను భవనంపై నుంచి విసిరేశాడు
X

దిశ, వెబ్ డెస్క్: కోల్ కతాలో ఓ దారుణం ఘటన చోటు చేసుకున్నది. కుటుంబ వివాదంతో ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలను భవనం పై నుంచి కిందకు పడేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సెంట్రల్ కొల్ కతాలోని బుర్రాబజార్ లో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనంలో నివసిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం నెలకొన్నది. ఈ నేపథ్యంలో అతనిపై కక్ష పెంచుకున్న నిందితుడు ఇద్దరు పిల్లలను భవనం పైనుంచి విసిరేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరు పిల్లలను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఓ పిల్లవాడు మృతిచెందాడు. ఇంకో పిల్లవాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అదేవిధంగా అరెస్ట్ చేసిన వ్యక్తి కొద్ది రోజుల క్రితం పిల్లల తండ్రితో గొడవ పడ్డాడని విచారణలో వెల్లడైందని పోలీస్ అధికారి శర్మ తెలిపారు.

Advertisement

Next Story