తాగొద్దన్నందుకు పురుగులమందు తాగిండు

దిశ, బాన్సువాడ: భార్య తనను తాగొద్దన్నదని భర్త పురుగుల మందు తాగి మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ గ్రామానికి చెందిన ఇస్తరాకుల భూమయ్య (40) నిత్యం తాగి ఇంటికి వస్తుండేవాడు. దీంతో తాగొద్దని భార్య సావిత్రి సూచించింది. దీంతో అతను మనస్థాపానికి గురై శనివారం రాత్రి పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement