- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రగతి భవన్ ఎదుట వ్యక్తి హల్‌చల్.. టెన్షన్‌లో పోలీసులు

దిశ, ఖైరతాబాద్ : ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ ముందు మెదక్ జిల్లా చిన్న శంకరం పేటకు చెందిన మొయినుద్దీన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మొయినుద్దీన్‌కు అతని సోదరులకు శంకరంపేటలోని ఇంటి వివాదం కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు అన్యాయం చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలంటూ బుధవారం ప్రగతి భవన్ వద్ద మొయినుద్దీన్ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే గమనించి మొయినుద్దీన్‌ను అడ్డుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకుని, విచారించగా కుటుంబ సభ్యుల మధ్య స్థల వివాదం కొనసాగుతుందని తెలిపాడు. కాగా, ముఖ్యమంత్రి నివాసం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసినందుకు గాను మొయినుద్దీన్‌పై కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. కాగా ప్రగతి భవన్ వద్ద ఇటీవల తరచూ ఆత్మహత్యాయత్నాలు, ఆందోళనలు జరుగుతుండడంతో పోలీసులు టెన్షన్‌కు గురవుతున్నారు.