చెట్టు పైనుంచి జారి పడి.. గీత కార్మికుడు మృతి

దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెట్టుమీద నుంచి జారి పడి గీత కార్మికుడు కే.ఉప్పలయ్య(55) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి రోధించిన తీరు, అందరినీ కంటనీరు తెప్పించింది. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తుచేస్తున్నారు.

Advertisement