వ్యవసాయం కోసం లక్ష డాలర్ల ఉద్యోగానికి బై బై!

by  |
వ్యవసాయం కోసం లక్ష డాలర్ల ఉద్యోగానికి బై బై!
X

దిశ, వెబ్‌డెస్క్: సంవత్సరానికి లక్ష డాలర్లు.. అంటే రూ. 73 లక్షల చిల్లర. అంటే నెలకు రూ. 6 లక్షల జీతం. ఇలాంటి ఉద్యోగం దొరకడమే పెద్ద వింత. కానీ అలాంటి ఉద్యోగాన్ని వ్యవసాయం చేయడం కోసం వదులుకోవడం నిజంగా గొప్ప విషయం. అవును.. వ్యవసాయం కోసం ఓ వ్యక్తి లక్ష డాలర్ల ప్యాకేజీతో ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అమెరికా, దుబాయ్‌లో పనిచేసి వచ్చి, ఇప్పుడు ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటున్నాడు. వ్యవసాయం అనేది అదృష్టంతో ఆట. అన్ని సక్రమంగా జరిగినప్పటికీ ఏదో ఒక్క తప్పిదం వల్ల మొత్తం పంట మొత్తం నష్టపోయే అతి సున్నితమైన ఉపాధి. అలాంటి ఉపాధి కోసం ఇంత పెద్ద సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఎందుకు?

కర్ణాటకలోని కాలాబుర్గి జిల్లాకు చెందిన సతీష్ కుమార్ అమెరికాలో సంవత్సరానికి లక్ష డాలర్ల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండేవాడు. కంపెనీ అవసరాల నిమిత్తం లాస్ ఏంజెలీస్, యునైటెడ్ స్టేట్స్, దుబాయ్ ఆఫీసులకు వెళ్తుండేవాడు. కానీ అక్కడ చేస్తున్న ఉద్యోగం ఆయనకు చాలా రొటీన్‌గా అనిపించింది. ఆ ఉద్యోగంలో ఎక్కువగా సవాళ్లు లేకపోగా తన వ్యక్తిగత జీవితానికి సమయాన్ని కేటాయించలేకపోవడంతో సతీష్‌కు చిరాకు వచ్చింది. అందుకే రెండేళ్ల క్రితం ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి సొంతూరుకి వచ్చాడు. ఇటీవల ఆయన రెండెకరాల చేనులో మొక్కజొన్న పండించి దాన్ని రూ. 2.5 లక్షలకు అమ్మినట్లు కుమార్ తెలియజేశారు.


Next Story

Most Viewed