బోన్‌లెస్ చికెన్‌లో బోన్స్ ఉంటాయా? 

by  |
బోన్‌లెస్ చికెన్‌లో బోన్స్ ఉంటాయా? 
X

దిశ, వెబ్‌డెస్క్ : కోడిలో ఎన్ని భాగాలున్నాయో అన్ని భాగాలనూ మనం తింటుంటాం. లెగ్ పీస్, లివర్, చెస్ట్ పీస్, వింగ్స్, బోన్‌లెస్, స్కిన్‌లెస్.. ఇలా కోడిలోని ఒక్కో పార్టును ఒక్కో రేటుకు విక్రియస్తుంటారు. అయితే, కోడి ముందా? గుడ్డు ముందా? అనే అనుమానం చాలా మందికి వచ్చింది కానీ.. బోన్‌లెస్ చికెన్‌లో బోన్స్ ఎందుకుంటాయి? అనే డౌట్ ఎవరికీ రాలేదనుకుంటా! వచ్చినా.. అది కూడా ఓ డౌటేనా? అంటూ కొట్టి పారేసురుంటారు. కానీ, ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ ఓ అమెరికా యువకుడు కోర్టు మెట్లెక్కడం గమనార్హం.

అమెరికా, నెబ్రస్కా సిటీలోని ఓ పట్టణమే ‘లింకన్’. ఆ పట్టణానికి చెందిన 27 ఏళ్ల యువకుడు అండర్ క్రిస్టెన్సన్.. ఇటీవలే లింకన్ సిటీ కౌన్సిల్‌‌లో తనతో సహా సమావేశమైన చట్టసభ‌లో మాట్లాడుతూ.. బోన్‌లెస్ చికెన్ పేరు మార్చాలని, బోన్‌లెస్ చికెన్ వింగ్స్‌ పేరును రెస్టారెంట్ మెనూలో నుంచి, ప్రజల హృదయాల్లోంచి చెరిపేయాలని కౌన్సిల్‌ను కోరాడు. ‘ప్రస్తుతం పిల్లలు కొన్ని పదాలకు అర్థాలకు తెలియకుండానే వాడుతున్నారు. వారికి అర్థమయ్యేలా మనమే వివరించాలి. ఎముకల మీద సహజ సిద్ధంగానే మీట్ పెరుగుతుందనే అవగాహన వారికి కలిగించాలి. మనం అబద్దాల్లో బతుకుతున్నామని.. ఆ పద్దతిని మార్చాలి’ అని ఆయన అన్నాడు. బోన్‌లెస్ చికెన్ పేరుకు ‘ట్రాష్, బఫెలో స్టైల్ చికెన్ టెండర్స్, వెట్ టెండర్స్, సాసీ నగ్స్’ తదితర పేర్లలో ఏదో ఒక పేరు పెట్టాలని క్రిస్టెన్సన్ కౌన్సిల్‌కు సూచించాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో.. అగ్రరాజ్యంలో ఇప్పుడు ‘‘బోన్‌లెస్ చికెన్’’ వ్యవహారం సంచలనంగా మారింది.


Next Story