- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘రెంట్ ఏ డాడీ’సర్వీస్..మీకు తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: ఇంటిని, కారును, చివరకు బైక్‌ను కూడా రెంటల్ సర్వీస్ బేస్ మీద తీసుకుంటాం. అంతెందుకు విమానాలను కూడా రెంట్ తీసుకునే సదుపాయం ఉంటుంది. చాలా సినిమాల్లో డబ్బులు తీసుకుని ‘భర్త’లుగా, తండ్రులుగా నటించే వాళ్లను చూశాం. అంతేకాదు చాలా సినిమాల్లో మార్కులు తక్కువగా వచ్చాయనో, లేదా పరీక్షలో కాపీ చేసి దొరికిపోయాడనో ఇంకేదైనా కోతి పని చేసినప్పుడో తమ తండ్రులను తీసుకువస్తేనే కాలేజీలో ఉంటారు లేదంటే..డిబార్ అంటూ లెక్చరర్లు స్టూడెంట్స్‌కు వార్నింగ్లు ఇస్తారు. ఆ సమయంలో నాన్నలుగా ఎవరో ఒకర్ని పట్టుకుని వచ్చి మా వాడు చేసిన పని తప్పే కానీ, ఈసారికి క్షమించి డిబార్ చేయొద్దని ప్రాధేయపడతారు. ఇక్కడ వాళ్ల పాత్ర తక్కువే. వాళ్లంతా డూప్ నాన్నలు. కాసేపు అలా నాన్నలుగా నటించి వెళ్లిపోతారు. మరి ఇలాంటి సర్వీస్ నిజంగా వస్తే.. అలా ఎలా కుదురుతుంది? అంటారా..మన సమస్యల్లోంచి కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తాయి. సమస్యలకు పరిష్కారాలే కొత్త ఇన్వెన్షన్‌కు నాందిగా నిలుస్తాయి. అలా..న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన జేమ్స్..సోషల్ మీడియాలో ‘రెంట్ ఏ డాడీ’ అంటూ విచిత్రమైన పోస్ట్ పెట్టాడు. దాని సారాంశం ఏంటో..ఇక్కడ చదివి తెలుసుకోండి..లెట్స్ గో..
చాలా మంది జీవితాల్లో మొదటి హీరో ‘నాన్నే’. కుటుంబ బాధ్యత మోస్తూ, కుటుంబానికి అండగా ఉంటూ నిరంతర ప్రయాణం చేస్తాడు. నాన్నగా మారే వరకు ఆయన కూడా..ఓ కుర్రాడే. కానీ, పిల్లల రాకతో రెస్పాన్సిబుల్ ఫాదర్‌గా మారిపోతాడు. తన ప్రతిరూపమైన పిల్లల జీవితమే ముఖ్యంగా జీవిస్తాడు. ప్రతీ క్షణం పిల్లలే లోకంగా..వారి భవిష్యత్తే ప్రధానంగా ముందుకు సాగుతాడు. ఆ పయనంలో ఎన్నో అడ్డంకులను దాటుతాడు. అదంతా ఈజీ బాధ్యత కాదు. ఇలాంటి నిజ జీవిత నాన్న పాత్రను పోషించడానికి సర్వీస్ ఉందట. ఆస్ట్రేలియా, న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన జేక్ జేమ్స్ ‘డాడీ సర్వీస్’ అందిస్తానని అంటున్నాడు. వినడానికే వింతగా.. చాలా కొత్తగా.. ఉంది కదా! డబ్బులకు ‘పేరెంటల్ సర్వీస్’ అందిస్తానని అంటున్నాడు. అంతేకాదు ఎవరైనా..ప్రొఫెషనల్ నాన్నలు ఉంటే వారికి ఉద్యోగాలు కూడా ఇస్తాడట. ఈ సర్వీస్ ఇండియాలో కూడా మొదలైతే..ఇక అందరు నాన్నలకు భలే గిరాకీ ఉంటుందనడంలో ఏ సందేహాం లేదు.
సర్వీసులో పేర్కొన్న అంశాలు..
– ప్రతి నెలలో 1-2 వీకెండ్స్‌లో డాడీ సేవలు అందిస్తాను.
– పిల్లల కోరిక మేరకు మూడు యాక్టివిటీస్‌లో పార్టీసిపేట్ చేస్తాను.
– అన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్‌కు హాజరవుతాను.
– కారు మెయింటెన్స్ ఎలా చేయాలి, గార్డెనింగ్‌లో మెలకువలు ఏంటీ?, లాన్‌ను ఎలా మూవింగ్ చేయాలి? వంటి ప్రాక్టికల్ లెర్నింగ్ నేర్పించడం. దీనికోసం మూడు గంటలు కేటాయిస్తాను.
– డే కేర్ లేదా స్కూల్ పికప్, డ్రాప్ చేస్తాను.
– ఫ్యామిలీ ఈవెంట్స్, స్పెషల్ డేస్ అంటే.. బర్త్‌డే పార్టీలకు రావాలంటే.. అదనంగా డబ్బులు చెల్లించాలి.
– ఫేస్‌బుక్ రిలేషన్‌షిప్ స్టేటస్ పెట్టుకోవాలన్నా..ఫ్యామిలీ సెల్ఫీ దిగాలన్నా..వాటికి కూడా అదనపు రుసుమే.
గమనిక: ఈ కాలంలో.. పార్టీలు చేసుకోకుండా ఎవరైనా ఉంటారా? సెల్ఫీలు దిగకుండా ఉండగలరా? అందుకే మరి ఇలాంటి వాటికి కండిషన్స్ అప్లయ్ అంటున్నాడు జేమ్స్.
సాధారణ రోజుల్లో స్టాండర్డ్ రేటు గంటకు 30 డాలర్లు. అయితే, సండే రోజు 4 గంటల తర్వాత..ప్రతి గంట, గంటకు అదనపు సర్ చార్జీ ఇవ్వాల్సి ఉంటుంది. డిన్నర్ డేట్స్ బిల్ కూడా వాళ్లే పే చేయాలి. క్యాష్, డెబిట్, ఆఫ్టర్ పే, జిప్ పే సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. సేవల కోసం డైరెక్ట్‌గా కాంటాక్ట్ కావచ్చు. సర్వీస్ ఎట్ యువర్ డోర్ స్టెప్ నుంచి..రెంట్ ఏ డాడీ వరకు సమాజం మార్పులను స్వాగతిస్తోంది. అయితే ఇది చాలా కమర్షియల్ యాడ్ కావచ్చు. ఇందులో సామాజిక కోణం లేదు కావచ్చు. ఈ సర్వీస్ చాలా మంది చిన్నారులకు ఉపయోగపడుతుంది. చాలా మంది పిల్లలకు నాన్నలు ఉండరు. వాళ్లకు నాన్న ప్రేమ దొరకదు. తమ తోటి చిన్నారులు నాన్నలతో ఆడుకుంటున్నా..నాన్నలు స్కూలుకు వచ్చి దించి వెళుతుంటారు. టాటా చెబుతున్నా ఆ పిల్లలకు నాన్న లేకపోవడంతో చాలా బాధగా ఉంటుంది. ఆ సమయంలో వారికి నాన్న కావాలి. ఆ చిన్న హృదయాలకు కాస్త సంతోషం కావాలి. అంతే.. నాన్న లేడు అనే దానికన్నా నాన్న పిలుపు ఉందంటే చాలు వారికి ఎక్కడి లేని ధైర్యం వస్తుంది. వసివాడిన ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తాయి. సో.. ఆ చిట్టిపొట్టి బుజ్జాయిలకు కొంత వయసు వరకు నాన్న కావాలి. ఆ తర్వాత నాన్న లేడు అనే విషయం చెప్పాల్సిన పద్ధతిలో చెబితే.. అంతా సెట్ అవుతుంది.