- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మురళి దెబ్బకు… ప్రాణం వదిలిన రాముడు !

X
దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. పొలం పంచాయతీ ఘర్షణలో శనివారం మధ్యాహ్నం ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆందోల్ మండలం మాన్‌సాన్‌పల్లిలో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పొలం గెట్టు విషయంలో సొంత పెదనాన్న రాముడును మురళి అనే యువకుడు కత్తితో నరికాడు. దీంతో రాముడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఇదేక్రమంలో అక్కడున్న తమ్ముడు శ్రీకాంత్ అడ్డురాగా అతనిపై కూడా కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం తీవ్రగాయాలతో శ్రీకాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story