పెట్రోల్ బంక్‌లో వ్యక్తి దారుణ హత్య

by Anukaran |
పెట్రోల్ బంక్‌లో వ్యక్తి దారుణ హత్య
X

దిశ, బాల్కొండ: పెట్రోల్ బంక్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన బాల్కొండ గ్రామశివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం అర్థరాత్రి బాల్కొండలోని జాతీయ రహదారిపై ఉన్న ఇండియన్ పెట్రోల్ బంకులో రామకృష్ణ(45) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మంగళవారం ఉదయం బంక్ లో పని చేసే మిగతా వ్యక్తులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బాల్కొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని మార్చురీకి తరిలించారు. మృతుడికి తెలిసిన వ్యక్తులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed