డీసీఎం వాహనం ఢీకొని వ్యక్తి మృతి..

by Shyam |
డీసీఎం వాహనం ఢీకొని వ్యక్తి మృతి..
X

దిశ, అల్వాల్: డీసీఎం వాహనం ఢీకోన్న సంఘటనలో హస్మత్​పేట్‌కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం అల్వాల్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం హస్మత్​పేట్​లోని ధనలక్ష్మి కిరాణా షాపు పక్కన ఆగి ఉన్న డీసీఎం నంబర్​ TS 07 UB 4847 గల వాహనం ముందు అదే ప్రాంతానికి చెందిన కృష్ణ స్వామి(56) కూర్చున్నాడు అది గమనించని డ్రైవర్​ముందుకు నడపడంతో కృష్ణ స్వామికి తీవ్ర గాయాలైనాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వ్యక్తిని గాంధీకి తరలించారు. అయితే ఛాతి, పొట్టపై బలమైన గాయాలవడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


👉 Read Disha Special stories


Next Story