- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని వ్యక్తి మృతి
by Shyam |

X
దిశ, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టిన వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని నాగారం మండలం జనగామ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… నాగారం మండలం శాంతినగర్‌కు చెందిన షేక్ సైదులు(45) ఉదయం తన ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం అర్వపల్లికి వెళ్ళి వస్తున్నాడు.
ఈ క్రమంలోనే సూర్యాపేట-జనగామ జాతీయ రహదారి విజయ్‌నగర్ వద్ద కట్టెల లోడుతో ఆగిఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టాడు. దీంతో ఛాతికి బలమైన దెబ్బ తగలడంతో సైదులు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఒక కొడుకు ఉన్నారు.
Next Story