- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కలకలం.. కరోనా పేషెంట్ సూసైడ్
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్‌లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. వైజాగ్‌లోని శాంతినగర్‌కు చెందిన భూతల శ్రీను మహేష్ (48) అనే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా సోకిందన్న విషయాన్ని దాచి, ఈ నెల 11న ఉదయం నాలుగు అంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతనిని చూసేందుకు శాంతి నగర్ వాసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అనంతరం అతని దేహానికి పోస్టు మార్టం నిర్వహించగా, అతనికి కరోనా ఉన్నట్టు బయటపడింది. దీంతో శాంతి నగర వాసుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, కరోనా అని తేలినందునే శ్రీను ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు.
Next Story