జుక్కల్‌లో నీటిలో కొట్టుకుపోయి వ్యక్తి మృతి

by Sumithra |
జుక్కల్‌లో నీటిలో కొట్టుకుపోయి వ్యక్తి మృతి
X

దిశ, జుక్కల్: మంజీరా నది పరవళ్లు తోక్కుతోంది. భారీ వర్షాలలతో మంజీరా నదికి వరద పెరిగింది. దీంతో జుక్కల్ నియోజకవర్గంలో భారీ వరద నీరు చేరడంతో సరిహద్దు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చుట్టూ జల ప్రవాహం పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మధ్నూరు మండలంలోని సరిహద్దు గ్రామాలు గోజేగావ్, సిర్పూర్, టాక్లీ గ్రామాలకు మంజీరా వరద ఉధృతి పెరగడంతో గ్రామాల చుట్టూ నీరు చేరింది. దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

బిచ్కుంద మండలంలోని మెక్క గ్రామానికి వాగునీరు వరద ఉధృతి పెరగడంతో గ్రామం చుట్టూ పంట చేలు నీటమునిగాయి. రోడ్డుపైన నీరు చేరడంతో గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. జుక్కల్ మండలంలోని చండేగా౦ గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు టాక్లీ గ్రామానికి చెందిన రైతు రాందాస్ (50) నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. బిచ్కుంద మండలంలోని పెద్దదేవాడ పులకలు గ్రామాల మధ్య ఉన్న వాగు ఒకేసారి వరద నీరు పెరిగింది. దీంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామాల వారీగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించడానికి గ్రామ రెవెన్యూ అదికారులకు సహాయకులకు సిద్ధం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Advertisement

Next Story