వైఫ్ ప్రెగ్నెంట్.. భార్య చెల్లితో రాత్రి లాడ్జీకి వెళ్లిన భర్త.. మార్నింగ్ లేచేసరికి..

by Anukaran |   ( Updated:2021-10-28 23:31:52.0  )
illegal-affair
X

దిశ, వెబ్‌డెస్క్ : వివాహేతర సంబంధాలు చాలా మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. కొద్ది నిమిషాల సుఖం కోసం కొంత మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వావీ వరసలు మరిచి మృగాలుగా మారుతున్నారు. భార్య ఉండగానే ఆమె చెల్లితో ప్రేయాయణం నడిపిన ఓ వ్యక్తి.. చివరకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.

ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌ చందానగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన సాయి నవీన్ (26) నాలుగేళ్ల క్రితం కూకట్‌పల్లి జేఎన్‌టీయూకి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉండగా.. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉంది. కొన్ని సంవత్సరాలు సాఫీగా గడిచిన వీరి వివాహ బంధంలో ఏడాది కాలంగా గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నవీన్ కన్ను భార్య చెల్లెలు(మరదలు)పై పడింది. ఈ విషయం కాస్తా భార్యకు తెలియడంతో అసలు గొడవ స్టార్ట్ అయింది. దీంతో భార్య.. తమ కుటుంబ సభ్యుల సొంతూరైన గుడివాడకు వెళ్లింది. ఈ క్రమంలో నవీన్ తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో.. భార్య మళ్లీ నవీన్ దగ్గరకు వచ్చింది.

ఇది ఇలా ఉండగా.. మూడు రోజుల క్రితం మరదలితో కలిసి నవీన్ తిరుపతి వెళ్లాడు. అక్కడే ఓ లాడ్జీలో రూమ్ అద్దెకు తీసుకున్నారు. అయితే, అక్కకు అన్యాయం చేసి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూ మరదలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఏం చేయాలో తెలియక.. తప్పు చేశానని తెలుసుకున్న నవీన్.. గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఆమెకు మెలకువ రావడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed